మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Indra Kruta Sri Rama Stotram – శ్రీ రామ స్తోత్రం (ఇంద్ర కృతం)
ఇంద్ర ఉవాచ |
భజేఽహం సదా రామమిందీవరాభం
భవారణ్యదావానలాభాభిధానమ్ |
భవానీహృదా భావితానందరూపం
భవాభావహేతుం భవాదిప్రపన్నమ్ || 1 ||
సురానీకదుఃఖౌఘనాశైకహేతుం
నరాకారదేహం నిరాకారమీడ్యమ్ |
పరేశం పరానందరూపం వరేణ్యం
హరిం రామమీశం భజే భారనాశమ్ || 2 ||
ప్రపన్నాఖిలానందదోహం ప్రపన్నం
ప్రపన్నార్తినిఃశేషనాశాభిధానమ్ |
తపోయోగయోగీశభావాభిభావ్యం
కపీశాదిమిత్రం భజే రామమిత్రమ్ || 3 ||
సదా భోగభాజాం సుదూరే విభాంతం
సదా యోగభాజామదూరే విభాంతమ్ |
చిదానందకందం సదా రాఘవేశం
విదేహాత్మజానందరూపం ప్రపద్యే || 4 ||
మహాయోగమాయావిశేషానుయుక్తో
విభాసీశ లీలానరాకారవృత్తిః |
త్వదానందలీలాకథాపూర్ణకర్ణాః
సదానందరూపా భవంతీహ లోకే || 5 ||
అహం మానపానాభిమత్తప్రమత్తో
న వేదాఖిలేశాభిమానాభిమానః |
ఇదానీం భవత్పాదపద్మప్రసాదా-
-త్త్రిలోకాధిపత్యాభిమానో వినష్టః || 6 ||
స్ఫురద్రత్నకేయూరహారాభిరామం
ధరాభారభూతాసురానీకదావమ్ |
శరచ్చంద్రవక్త్రం లసత్పద్మనేత్రం
దురావారపారం భజే రాఘవేశమ్ || 7 ||
సురాధీశనీలాభ్రనీలాంగకాంతిం
విరాధాదిరక్షోవధాల్లోకశాంతిమ్ |
కిరీటాదిశోభం పురారాతిలాభం
భజే రామచంద్రం రఘూణామధీశమ్ || 8 ||
లసచ్చంద్రకోటిప్రకాశాదిపీఠే
సమాసీనమంకే సమాధాయ సీతామ్ |
స్ఫురద్ధేమవర్ణాం తడిత్పుంజభాసాం
భజే రామచంద్రం నివృత్తార్తితంద్రమ్ || 9 ||
ఇతి శ్రీమదధ్యాత్మరామాయణే యుద్ధకాండే త్రయోదశః సర్గే ఇంద్ర కృత శ్రీ రామ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.